బాలల మానసిక వికాసానికి కథలు

తల్లిదండ్రులు పిల్ల మార్కులపట్ల, ర్యాంకుల పట్ల చూపుతున్న శ్రద్ధ వారిలోని సృజనాత్మకత పట్ల, మానసిక వికాసం పట్ల చూపటం లేదన్నది అసత్యం కాదు. పిల్లల్ని ఎంతసేపు పాఠశాల నాలుగ్గోడల మధ్య నిర్బంధించి, పాఠ్యపుస్తకాలకు పరిమితం చెయ్యాలని చూస్తున్నారు. పిల్లల్ని ఆట పాటలకు దూరం చేస్తూ మానసిక ఉల్లాసం లేకుండా చేస్తున్నారు. ఇంటా బయటా పిల్లల్ని ఒత్తిడి పెడ్తూ అశాంతికి గురిచేస్తున్నారు. దానివల్ల పిల్లలు మానసికంగా కుంగుబాటుకు లోనవుతున్నారు. పెద్దవాళ్లు కేవలం పిల్లల భవిత గురించే కాదు! నడత గురించి కూడా ఆలోచించాలి.

పిల్లలు చదువులో చురుగ్గా వుండాలంటే ఆట పాటలూ వుండాలి. సాహిత్యం పట్ల, కళల పట్ల అభిరుచీ కలిగి వుండాలి. అప్పుడే పిల్లల్లో సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. ఆత్మ విశ్వాసంతో, వ్యక్తిత్వవికాసంతో భవిష్యత్తుకు వాళ్లే బాటలు వేసుకోగలుగుతారు. సాహిత్య పఠనం ద్వారా పిల్లలు మానవీయ విలువల గురించి తెలుసుకోగలుగుతారు. - వల్లూరు శివప్రసాద్‌

పిల్లల మానసిక వికాసానికి దోహద పడేలా, కథల్ని ఎంపిక చేసి 'బాలల నీతి కథాస్రవంతి' పేరిట ప్రచురించాం. ఈ బాలల నీతి కథాస్రవంతిలో తొమ్మిది మంది రచయితల 10 పుస్తకాలు వున్నాయి. అవి 1. రాణిగారి కాసులపేరు - కలువకొలను సదానంద 2. పిట్ట కథలు - వల్లూరు శివప్రసాద్‌ 3. పాపిష్టి డబ్బు - మాచిరాజు కామేశ్వరరావు 4. ఎవరు గొప్ప - గంగిశెట్టి శివకుమార్‌ 5. ఢంఢం డబడబ ఢమాఢమా! -  కలువకొలను సదానంద 6. చేదు మాత్రలు - దాసరి వెంకట రమణ 7. బంగారం చేసే విద్య - వసుంధర, 8. బడాయి బక్కయ్య - వాసాల నరసయ్య, 9. కాకెత్తుకెళ్ళింది - అలపర్తి వెంకతసుబ్బారావు, 10. గొప్పల కప్ప - ఎం.హరికిషన్

Write a review

Note: HTML is not translated!
Bad           Good