'చలంలోని తీవ్రమైన, జిజ్ఞాసాతత్పరమైన ఆవేదనలోంచి, అశాంతిలోంచి వెలువడిన విభిన్న భావ ధోరణుల పరంపరలు మ్యూజింగ్స్‌.''

''వ్యక్తిగతంగా తెలుగులో నేను చలాన్ని ఇష్టపడతాను. శ్రీశ్రీ కవిత్వాన్ని అమితంగా ఇష్టపడతాను. రష్యన్‌ రచయితలైన చెకోవ్‌, టాల్‌స్టాయ్‌, కుప్రిన్‌ అంటే నాకెంతో ఇష్టం. '' - గురోవ్‌

''ఛాయాదేవి కథల్లో చమక్కులు, కొసమెరుపులు కనిపించవు. అవి జీవితమంత పచ్చిగా, స్వచ్ఛంగా ఉంటాయి.''

''చివరకు మిగిలింది ఏమిటి అంటే - జీవితం అంటే ఏమిటో తెలుసుకోవడానికి దయానిధి చేసిన అన్వేషణ. ఈ నవల విశిష్టత వస్తుశిల్పాలు విడదీయలేనంద బలంగా కలసిపోవిడం, వ్యక్తి బాహ్య అంతర్‌ జగత్తులను తరచిచూడ్డంలో జీవితం తాలూకూ విలువల్ని గురించి ప్రధాన పాత్ర తపించడంలో కనబడుతుంది. బుచ్చిబాబు రచన సౌందర్యపేటికలా భాసిల్లింది. మానసిక సామాజిక స్రవంతి కళ్ళముందు ఎలా ప్రవహించిందో కళ్ళకు కట్టినట్లు ఈ నవలలో చిత్రించబడింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good