మనసు కసితో కరకర మంటున్నది. తనకు తెలుసు ఈ బాధలు భరిం చలేదని. కాని శ్రీధర్ తనను మోసం చేశాడు . తను చచ్చిపోతానని తెలిసే కావాలనే ఎంకరేజ్ చేశాడు. తను ఎమైపోతేనేం ? అతని ఐ కావలసింది పిల్లలు, తండ్రినయ్యాననే గర్వం. అది దొరికితే చాలు మగవాడికెంత స్వార్ధం ? అంత స్వార్ధం మనసులో పెతుఉకుని పైపైన తీపి మాటలు.  తానింత యాతనకు గురి అయ్యటప్పుడు ఆ వెధవ పిల్లలు లేకపోతేనేం ? అలా కాదు. ఆడదన్న తర్వాత చచ్చినట్లు పిల్లలి కని తీరవలసిందే పెద్దమ్మ గారు  చెప్పినట్లు తను స్వయంగా ప్రసవిన్చాలేకపోతే ?
ప్రసవ సమయంలో ఆడదాని మనసును అద్దం పట్టె కథ గెలుపెవరిది ?
ఈ కద తో పాటు ఈ సంపుటిలో మొతం ఆరు కథలున్నాయి. అవి - ఐ లవ్ యు, నమ్ముతాను, బహుమతి, గెలుపెవరిది ? నాకీ పెళ్లి వద్దు, తెలిసిన విలువలు.
ఈ కథలన్నిటిలోకి ఎంచదగినది ఐ లవ్ యు, హెస్టన్ ఓకే మంచి చిత్రకారుడు. అతడు ఆమెరికన్, అతడి ఫ్రెండ్ ప్రసాదరావు. హిందూ దేశపు అందాన్ని, చిత్రించటం, కోసం హెస్టన్ రావుని అతని భార్య ఫోటో ఇమ్మంటాడు. అయితే తన భార్య అందగతే కాదన్న భావంతో రావు ఒక ఫోటో స్టూడియో నుండి ఎవరో ఒక అందమైన అమ్మాయి ఫోటోని తెప్పించి యిస్తాడు. హెస్టన్ మాత్రం ఆ అమ్మాయి రావు భార్యే ననుకుంటాడు. ఈ విషయం కొంతకాలానికి తెలిసిపోతుంది. ఫోటోలోని అమ్మాయి సుజాత . ఆమెకు నుంచి హెస్టన్ మనసులో తుఫాను చెలరేగుతుంది. ఆ తరువాత ఏమి జరుగుతుందో కథ చదివి తెలుసుకోవలసిందే.  ఈ సంపుటిలోని అన్ని కథ లూ  ఊహించని మలుపులతో ఉండి  గబ గబా చదివిస్తాయి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good