బుద్ధభగవానులు వ్యాపారస్తులకి బాగా ఉపయోగపడ్డాడనీ, కాదు రాజులకుపయోగపడ్డాడనీ, అది కాదు, బుద్ధ ధర్మంలో వున్న వాళ్ళల్లో నూటికి తొంభై శాతం బ్రాహ్మణులేననీ, ఆయన బాహ్మణులకే బాగా వుపయోగపడ్డాడనీ, అదీ కాదు సంకుచిత ధర్మాలని త్రోసిరాజని ఆశేష దీన మానవులకే ఉపయోగపడ్డాడనీ... ఇలా ఏవో విసుర్లూ- విమర్శలూ ఖండనమండనలూ వినబడుతూ వుంటాయి. కొంతమంది విమర్శకులు వీటి గురించి పుస్తకాలే రాసిపారేశారు. బుద్ధ భగవానునికి పాక్షికత్వం అంటగడితే వారికి చాలా ఆనందం. తానే కాదు తనకు తోడు మరో గుడ్డివాడు వున్నాడంటే అజ్ఞానియైన గుడ్డి వాడికి ఎంత ఆనందమో యిదీ అటువంటిదే. హృదయం విప్పి చూస్తే, సర్వ మానవాళి సంక్షేమం కోసం బుద్ధ భగవానులు బుద్ధ ధర్మాన్ని ప్రవచించారు. ధర్మాన్ని ధర్మంగా, నిశితంగానే చెప్పారు గానీ, వక్రమార్గంలో గానీ, మరొకరి అహంకారాలను సమర్థిస్తూ గానీ, కొందరికి కోరి వరాలిచ్చిగానీ ఆయన ధర్మాన్ని ఉపదేశించలేదు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good