అమరావతిలో, నవ్యాంధ్రప్రదేశ్‌లో ఆవిర్భవిస్తున్న పెట్టుబడిదారీ విధానపరమైన పోకడలు

2014 జూన్‌ నెలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తెలంగాణా పరిశేషాంధ్రప్రదేశ్‌గా విభజించబడిన నాటినుండి, రెండు రాష్ట్రాలు పెట్టుబడి సమీకరణకు క్రొత్త పుంతలు త్రొక్కుతున్నాయి. ఈ అధ్యయనంలో మేము ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న పెట్టుబడిదారీ విధానం యొక్క నిర్దిష్ట రూపాన్ని విశ్లేషించాము. ప్రపంచ పెట్టుబడిదారీ విధానం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దశలో కొత్తగా నిర్మాణమవుతున్న అమరావతీ నగరం సంక్షోభ పరిష్కారానికి సహాయపడుతుందా, అలాగే భారతదేశంలోగానీ, మరోచోటగానీ భవిష్యత్‌ పట్టణాభివృద్ధికి ఉదాహరణను నిలుపుతుందా అన్న విషయాన్ని మేము పరిశోధించాము. - వకుళాభరణం వంశీ చరణ్‌, ఎన్‌.పురేంద్ర ప్రసాద్‌

మాకు తగినంత నష్టపరిహారం చెల్లిస్తే మేము సోమరులవుతామని మా ముఖ్యమంత్రి చెప్తున్నారు. మా ఇళ్ళు యిక్కడ వున్నాయి. మా పిల్లలు యిక్కడి పాఠశాలలకే వెళ్తున్నారు. మాకు స్వంత స్థలాలు, పొలాలు లేవు. అందువల్ల క్రొత్త రాజధాని నిర్మాణం వల్ల మాకు ఒరిగేదేమీ లేదు. ప్రస్తుతం మాకు చేయడానికి పనులు కూడా లేవు. భవన నిర్మాణ పనులు జేయడం మాకు రాదు. పొట్ట చేతబట్టుకుని మేమిప్పుడు ఎక్కడకు వెళ్లగలం? 

- ప్రతిపాదిత రాజధాని నగరం అమరావతిలోని ఒకానొక గ్రామంలో వ్యవసాయ కార్మిక దళిత మహిళ మాటలివి.

పేజీలు : 32

Write a review

Note: HTML is not translated!
Bad           Good