తూర్పు గోదావరి జిల్లా రాజోలులో జననం (1941). రాజోలు, కాకినాడ, హైదరాబాదులో విద్యాభ్యాసం.
''దక్షిణ దేశీయాంధ్రవాజ్మయం-సాంఘీక పరిస్ధితులు అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుచి తెలుగులో డాక్టరేట్‌ పట్టా పొందారు. నిజామాబాద్‌ మహిళా కళాశాలలో పదకొండు సంవత్సరాలు తెలుగు ఉపన్యాసకులుగా, వైస్‌ ప్రిన్సిపాల్‌గా పనిచేశారుఏ. తెలుగు అకాడమీలో రీసెర్చ్‌ ఆఫీసర్‌గా చేరారు. ప్రస్తుతం డిప్యూటీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలుగు అకాడమీ ప్రచురించిన 'తెలుగు సాహిత్య కోశం' రెండు సంపుటాల పరిష్కరణ బాధ్యత వీరే నిర్వహించారు. సామాజిక సమస్యలపై చాలా వ్యాసాలు రాసారు. 'దళిత సాహిత్య వికాసం' వీరి అముద్రిత రచన. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good