పత్రికలు, గ్రీటింగ్‌ కార్డులు, పుస్తకాల కవర్‌ పేజీలు
బాలి బహుముఖ ప్రజ్ఞను చాటితే
దశాబ్దాలుగా జోక్స్‌ సేకరించి తన బొమ్మలు జోడించిన
ఈ పుస్తకం ఆయన హాస్యప్రియత్వానికి ఓ నిదర్శనం.

హాస్యం-వ్యంగ్యం, జీవనరీతి-నీతి, ఎత్తిపొడుపు-బుజ్జగింపు
గిలిగింత-చిరుహాసం, దరహాసం-అట్టహాసం ఇవన్నీ కార్టూన్‌ కళకు
అర్హమేనంటూ...విభిన్న అంశాలను శరం సంధించి దించని వీరునిలా
నిరంతర శ్రామికుడిలా, శరపరంపరగా పాఠకులపై చిత్రబాణాలను వదులుతున్న
మా 'బాలి' గురించి ముచ్చటగా మూడు వాక్యాల్లో చెప్పాలంటే....
రేఖాచిత్రాల లయ విన్యాసాల లాలి
రసమయ వర్ణచిత్రాల ¬లి
వెరసి మన చిత్రకారుడు బాలి - దేవి

Write a review

Note: HTML is not translated!
Bad           Good