Rs.50.00
Price in reward points: 50
In Stock
-
+
(మాయలఫకీరు మాయామందిరం, గాఢాంధకార వృతమైన గుహ, అస్థిపింజరాలు ఆధారం లేకుండా వ్రేలాడుతున్నాయి. జడలూ, గోళ్ళూ మిక్కుటంగా పెరిగివున్న ఒక ముని పుంగవుడి కళేబరం తలక్రిందులుగా అగ్నిగుండం మీద వ్రేలాడుతోంది. ఆ కళేబరంలో నుంచి నెత్తురుబొట్లు బొట్టుగా ¬మాగ్నిలో చిందుతూ వుండగా మంటలు భగ్గు భగ్గు మంటున్నవి. వెలుగులో రంగస్థలమంతా శక్తి ప్రతిమలతో భయంకరమై జిగేల్మంటూంది. ఒకవైపున భూగోళచక్రం, మరోవైపున బలిపీఠం మీద రెండుగా నరకబడ్డ ఒక శిశువు శవం. రంపపు కత్తి పీఠం చుట్టూ తైలదీపాలు, ఒక శిలా ప్రతిమాశక్తి నోటిలో యోగస్థితి దాని తల మీద మరికొన్ని ఆస్థులు అమర్చబడి ఉన్నవి. ఒక వికార ప్రతిమ కండ్లు నిప్పులు క్రక్కుతూ నిమిష నిమిషానికి మూసుకుంటూ వుంటాయి. ఒక మూల క్రూరమృగ సింహాసనం నేపథ్యాన వికటాట్టహాసాలు భయంకరంగా కదం త్రొక్కుతూ వచ్చి కొన్ని పిశాచాలు గుహనావరించేయి. కొంత సేపటకి నేపథ్యం నుండి ఒక్క పొలికేక.)