చదువు అనంతరం కెన్నెడి నావికాదళంలో చేరాడు. 1943లో పసిఫిక్‌ మహాసముద్రంలో ''టార్పెడో'' యుద్ధనౌకలో ప్రయాణం చేస్తుండగా, మధ్యలో జపాన్‌ దాడి చేసింది. దాంతో ఆ నౌక మధ్యకు చీలి తునాతునకలైంది. కానీ కెన్నడీ సముద్రంలో చెల్లాచెదురైన తన సిబ్బందిని పెద్ద బెల్టుతో కట్టి, దాని కొనను పళ్ళమధ్య బిగబట్టి, ఆరు మైళ్ళు ఈత కొట్టి , వారి ప్రాణాలను కాపడటం గురించి ఈ నాటికీ అమెరికాలో చెప్పుకుంటారు.
+++
ఇలా విశ్వవ్యాప్తంగా ఉన్న స్ఫూర్తి ప్రదాతలైన మహానుభావుల గురించి ఎన్నో విషయాలతో కూడిన పుస్తకమిది. ఇందులో స్వామి వివేకానంద, డాక్టర్‌ కె.ఎల్‌.రావ్‌, దయానంద సరస్వతి, జిడ్డుకృష్ణమూర్తి, గురు నానక్‌, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌, జాన్‌ ఎఫ్‌ కెన్నడీ, జార్జి వాషింగ్‌టన్‌, ఆల్ఫ్రెడ్‌ నోబుల్‌, టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్టీఆర్‌ లాంటి 28 మంది స్ఫూర్తి ప్రదాతల జీవిత విశేషాలు పొందుపరచడం జరిగింది.
ఏ మహనీయుడి చరిత్ర చదివినా, వారి బాల్యంలో ఇంట్లో పెద్దలు కథలు చెప్పేవారనీ, మానవతా విలువలు బోధించేవారనీ, మహాత్ముల చరిత్రలు చెప్పి ప్రేరణ కలిగించేవారనీ ఉంటుంది. ఇప్పుడు కాలం మారింది. కథలు చెప్పేవారు కంచికి చేరారు. సమిష్టి కుటుంబాలు సన్నబడిపోయాయి. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన స్ధితి. మరినేటి బాలబాలికలకు కథలు చెప్పేదెవరు? కాబట్టే ఈ పుస్తకం బాల బాలికల నుద్ధేశించి రాయడం జరిగిందంటారు రచయిత బి.వి.పట్టాభిరామ్‌గారు. చక్కని పుస్తకమిది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good