ఏ మహనీయుడి చరిత్ర చదివినా, వారి బాల్యంలో ఇంట్లో పెద్దలు కథలు చెప్పేవారనీ, మానవతా విలువలు బోధించేవారనీ, మహాత్ముల చరిత్రలు చెప్పి ప్రేరణ కల్గించేవారనీ ఉంటుంది.
ఇప్పుడు కాలం మారింది. కథలు చెప్పేవారు కంచికి చేరారు. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు, వ్యాపారాలు లేదా ఇతర వ్యవహారాల్లో పడిపోయారు. సమిష్టి కుటుంబాలు సన్నబడిపోయాయి.
మరి నేటి బాలబాలికలకు కథలు చెప్పేదెవరు? అంటే 'టెలివిజన్‌' అనే సమాధానం వస్తుంది. మనముందు తరానికి సంబంధించిన మహనీయుల గురించి, వారు అనుసరించిన బాటల గురించి చెప్పేదెవరు? పిల్లలకు అటువంటి వారి గురించి ఒకటి రెండు పాఠాలు పెట్టినా, ప్రభుత్వాలు మారినప్పుడల్లా, రాజకీయ నాయకులు జోక్యంతో ఆ పాఠాలు తీసెయ్యడం జరుగుతుంది.
ఈ నేపధ్యంలో నేటి బాలబాలికలకు ఆ మహనీయులు (వివిధ రంగాలలో తమ నిస్వార్ధ సేవతో కృషి చేసి జాతికి అలంకారంగా భాసిల్లిన వారి ) గురించి తెలియవలసిన అవసరం ఎంతైనా ఉందని భావించి శ్రీ బి.వి.పట్టాభిరామ్‌ గారు ఆంధ్రప్రభ వార పత్రికలో మూడు సంవత్సరాలపాటు 'బాలలకు బంగారుబాట' అనే శీర్షిక నిర్వహించి, 'స్ఫూర్తి ప్రదాతలు, కళాకాఉలు, సాహిత్య వేత్తలు, జాతినేతలు, సమాజ సేవకులు'  పుస్తకాలు రాసారు. ఆకోవలోనిదే 'శాస్త్రవేత్తలు' పుస్తకం.
ఇవి పిల్లలకే కాక పెద్దలకు కూడా స్ఫూర్తి కలిగిస్తాయన్న విశ్వాసం మాకుంది. అందుకే 27 మంది శాస్త్రవేత్తల జీవిత చరిత్రలున్న ఈ శాస్త్రవేత్తలు పుస్తకాన్ని చదవండి, చదివించండి. బాలబాలికలకు బహుమతిగా అందించంది. వారిలో ప్రేరణ కలిగించండి.
పరిచయాలు ఎంత బగున్నాయో, అంతే బాగున్న చక్కని చిత్రాలను గీసింది ప్రముఖ చిత్రకారులు శ్రీ బి.వి.సత్యమూర్తిగారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good