ఈ పుస్తకంలో శ్రీ బి.వి.పట్టాభిరామ్‌ గారు పిల్లల  కోసం -కత్తులు కటారులు, తుపాకులు, బాంబులు లేకుండా అహింసనే ఆయుధంగా చేసుకుని తెల్లవారిపై యుద్ధం చేసిన గాంధీ గురించి, న్యాయవాదిగా, లెక్చరర్‌గా పనిచేసి స్వాతంత్య్ర సమరంలో పాల్గొని భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతిగా పదవీస్వీకారం చేసిన బాబూ రాజేంద్రప్రసాద్‌ గురించీ, ఐసిఎస్‌ పరీక్ష పాసయ్యి, అనంతరం అన్నీ త్యాగం చేసి స్వాతంత్య్రసమరంలో పాల్గొన్న-మాతృభాష ఇంగ్లీషు కాకపోయినా తన అద్బుత వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్లుకున్న - సురేంద్రనాధ్‌ బెనర్జీ గురించి దేశ స్వాతంత్య్రం కొరకు అనేక ప్రయాసలకు లోనయ్యి, తన పేరు అజాద్‌ అని, తండ్రి పేరు భారత్‌ అని, నివాసం జైలు అని ప్రకటించిన చరస్మరణీయుడు చంద్రశేఖర్‌ గురించి, కార్మిక సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసి -భారతదేశ అధ్యక్షపదవిని అలంకరించిన రెండవ తెలుగు వాడు శ్రీ.వి.వి.గిరి గురించి, తరతరాల బాలలకు స్ఫూర్తిదాయకమైన జీవితం గడిపి, భారత ప్రధానమంత్రి స్ధాయికి ఎదిగి, నిండు నూరేళ్ళు జీవించిన మొరార్జిదేశాయ్‌ గురించి, బ్రిటీష్‌ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తొలి భారతీయుడు దాదాభాయ్‌ నౌరోజి గురించి, మానవతావాదిగా, సర్వోదయ నాయకుడిగా పేరు గాంచిన జయప్రకాశ నారాయణ్‌ గురించి, సంపాదించే స్ధితిలో ఉండికూడా, దేశం కోసం, జాతికోసం ,సర్వం విడనాడి, చివరకు భార్యాబిడ్డలపై కూడా ప్రేమ చంపుకొని ఆంగ్లేయులతో హోరాహోరి పోరాడిన వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ గురించి, భారత స్వాతంత్య్ర చరిత్రలో అత్యంత కీలకమైన పాత్ర వహించి, సైనిక తిరుగుబాటులో ముఖ్యపాత్ర వహించిన, బ్రిటీషు వారి వెన్నులో వణుకు పుట్టించిన అపర చాణక్యుడు తాంతియా తోపే గురించి -మొత్తం 27 మంది జాతి నేతల గురించి - పిల్లలకు అర్ధమయ్యే విధంగా, వివరంగా పరిచయం చేశారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good