భారత కమ్యూనిస్టు ఉద్యమ మహాప్రస్థానంలో దాదాపు ఏడు దశాబ్దాలపాటు ముఖ్య భూమికను పోషించిన అగ్రశ్రేణినేత, కామ్రేడ్‌ బిటిఆర్‌. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమానికి, భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి నడుమ సంధానకర్తగా వ్యవహరించిన మార్క్సిస్టు మేధావి. మనదేశ నిర్ధిష్ట పరిస్థితుల్లో విప్లవోద్యమం ఏ పంథా చేపట్టాలో నిర్ధారించటంలో కీలకపాత్ర పోషించారు.

కష్టజీవుల విముక్తికి సోషలిస్టు సమాజ స్థాపనే పరిష్కారం. సోషలిజాన్ని సాధించడంకోసం జరగవలసిన మహోద్యమానికి నాయకత్వపాత్ర కార్మిక వర్గమే పోషించాలి. అందుకే మనదేశంలో సమరశీల కార్మికోద్యమ నిర్మాణానికి, విశాల ప్రాతిపదికన కార్మికవర్గాన్ని ఐక్యపరచడానికి కామ్రేడ్‌ బిటిఆర్‌ అవిరళ కృషి చేశారు. సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులుగా దాదాపు మూడు దశాబ్ధాలు మార్గనిర్ధేశం చేశారు. వర్గ ఐక్యత సాధనలో శ్రామిక మహిళలకు గల ప్రముఖ స్థానాన్ని తెలియజెప్పిన నేత బిటిఆర్‌. మత విద్వేషం, అస్థిత్వవాదం, ప్రాంతీయతత్వం, కార్మికవర్గ ఐక్యతను దెబ్బతీస్తాయని ముందే హెచ్చరించిన ద్రష్ట కామ్రేడ్‌ బిటిఆర్‌.

పేజీలు : 124

Write a review

Note: HTML is not translated!
Bad           Good