గురూజీ స్వామి మైత్రేయ ప్రాచీన భారతీయ ఆధ్యాత్మిక యోగ గురుపరంపరకు చెందినవారు. దాదాపు ఇరవై ఒక్క మంది గురువుల ద్వారా అనేకశాఖలలో - హఠయోగ, రాజయోగ, ఉపనిషత్తులు, బౌద్ధం, జైన్‌, సూఫీయిజం, తంత్ర, హస్సిడిజమ్‌, విపాసన, రేకీ, ప్రాణిక్‌ హీలింగ్‌, సిద్ధ, ఆయుర్వేద, ఏరోబిక్స్‌, హిప్నాటిజమ్‌లలో శిక్షణ పొంది, వాటిని అధ్యయనం చేసినవారు.

గత 35 సంవత్సరాల తమ నిరంతర సాధన ద్వారా భారతీయ ప్రాచీన విజ్ఞానంలో మరుగున పడిపోయిన అనేక పద్ధతులను తిరిగి వెలుగులోకి తెచ్చారు గురూజీ. అత్యంత క్లిష్టమైన తత్త్వ, వేదాంత సత్యాలను సామాన్యులకు అర్థమయ్యే సరళమైన భాషలో విప్పి చెప్పడం వారి ప్రత్యేకత.

వారి స్వానుభవంతో, జ్ఞానోదయం ద్వారా తెలుసుకున్న జీవిత సత్యాల నుండి జనించిన ఆధ్యాత్మిక జీవన మార్గం అత్యంత విశిష్టమైనది. జ్ఞానోదయం పొందిన అనేక ఆధ్యాత్మిక గురువుల ప్రబోధాల సారానికి చక్కని ప్రతిబింబమే వారు ప్రవేశ పెట్టిన జీవన శైలి. ప్రకృతి ధర్మాలతో పెనవేసుకుపోయిన వారి ప్రాపంచిక జీవితాన్ని అనుభవిస్తూనే సులభంగా ఆచరించదగ్గవి. లౌకిక జీవితంలోని ఆనందాన్ని, ఔన్నత్యాన్ని, శోభను, మహాత్మ్యాన్ని అనుభవిస్తూనే ఆధ్యాత్మికంగా పరిణతి సాధించగలగడమే ఈ జీవనశైలిలోని విశిష్టత. ఈ బోధనలను కేవలం వినడమే కాదు, ఆచరించి స్వానుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రాధాన్యాన్నిస్తారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good