ఆహరం రోగాలను కల్గించడంలోను , వ్యాధి చికిత్స లోనూ ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆహార నియమాలు పాటించక పొతే ఆరోగ్యం దెబ్బతింటుంది. రోగం త్వరగా తగ్గాలంటే పద్యా పద్యాలు తెలుగుకుని ఆచరించడం మొదటి కర్తవ్యం. ఉదాహరణకు మొలల వ్యాధి తో బాధ పడే వారికి కంద కూర చాలా శ్రేష్టం .మనం నిత్యం వాడే కాయ గూరల , పప్పుల పంట దినుసుల గుణాల , ఎటువంటి రసాయనౌషదాలు సేవిస్తే వ్యాధులు రాకుండా నివారించ వచ్చును. అటువంటి మూలికల వివరణలు - కామెర్లు , మొలల కడుపులో మంట, కడుపులో పుండు, కిళ్ళ నొప్పులు, ఉబ్బసం, బొల్లి వంటి వ్యాధులకు ఆయుర్వేద వైద్య ప్రయోజనం ఇంకా ఎన్నో వ్యాదులలో ఉపయోగపడే నిరపాయకరమైన మూలికా చికిత్సల ఈ గ్రంధంలో పేర్కొన బడ్డాయి. |