ఆయుర్వేదము ఆదికాలము నుండి మన్నవ పొందుతూ భారత దేశమున మిక్కిలిగా ఆచరింపబడుచున్నది. ఇప్పటికిని పాశ్చాత్య వైద్య విధానము అన్డుబాటులో లేని గ్రామములందు, గిరిజన ప్రాంతములందు , ప్రక్రుతి నుండి లభించిన ఔషధీ వైద్య విదానమునే ఆశ్రయించి, కృతకృత్య లగుచున్నారు. మిక్కుటముగా కొనసాగే ఈ వైద్య విధానమును ఇప్పడిప్పుడే దీని విలువలను గమనించి పరిశోధనలను గావించిన పాశ్చాత్యుల నోటనే ఇందలి సత్యములను వెల్లడించుటను వినిన భారతీయులే కనుక తెరచి ఈ ఆయుర్వేద వైద్య విధానము పట్ల బహుళ ప్రచారము గావించు చున్నారు.పరోపకారార్ధమిదం శరీరం అనుస్త్రుతి వాక్యము ననుసరించి పలువురు సామాన్య ప్రజానీకమునకు ప్రయోజన కారిగా నుండవలేనను ఉద్దేశముతో ఈ వైద్య గ్రంధము నందలి విషయములన్నియూ అనుభవాగ్నులగు వైద్యులచే చెప్పబడిన ప్రాచీన , నవీన గ్రంధముల నుండి సేకరించి పాఠకులకు అందించాడ మైనది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good