ఆంధ్రానాట 'పేరులేని వ్యాధికి పెన్నేరే మందు' అను నానుడి అశ్వగంధ (పెన్నేరు)ను సంజీవనిగా పేర్కొంటోంది. చిన్నపిల్లల నుండి ముసలి వారు వరకు ఎల్లరు ప్రతీరోజు అశ్వగంథ పొడిని తేనె, పాలు లేదా నీటితో సేవిస్తే రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధులబారిన పడకుండా రక్షించబడతారు. త్రిఫలా (కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ మిశ్రమం) ప్రతీరోజు సేవిస్తే అనేక వ్యాధులను నిరోధించవచ్చును. త్రికటు (శొంఠి), పిప్పళ్లు, మిరియాలు మిశ్రమం) జీర్ణకోశ వ్యాధులు, గుండె జబ్బులను నిరోధిస్తుంది. అడ్డసరం (వాసా) 'దగ్గు, క్షయ వంటి వ్యాధులకేగాక రక్తస్రావాన్ని ఆపటంలో దివ్యఔషధంగా ప్రసిద్ధి చెందింది. ఆధునిక వైద్యశాస్త్రం ఈ మొక్క నుంచి బ్రోమిక్సిన్‌ అనే ఔషధాన్ని తయారుచేసి ఉబ్బసం వల్ల వచ్చే దగ్గుకి చికిత్సను రూపొందించారు. కీళ్లవాతం, నొప్పుల నుండి ఉపశమనానికై గుగ్గులు, శల్లకీ వంటి చెట్టు నుంచి వచ్చే నిర్యాసం (జిగురు)తో అనేక ఔషధాలు తయారు చేస్తున్నారు. పసుపులో వుండే 'కురకామిన్‌' అనే విశిష్టతత్వం కేన్సర్‌ చికిత్సలో అత్యంత ప్రయోజకకారని ఇటీవల పరిశోధనల్లో నిరూపించబడింది. నేలవేము, నేల ఉసిరి, కటుక రోహిణి అనే మూలికలు లివర్‌కి బలాన్నివ్వడమేగాక కామెర్లను సమర్థవంతంగా తగ్గించగలవని గమనించడమైనది. వెల్లుల్లిపాయ; వాము నిత్యం సేవిస్తే పెరిగిన కొలస్ట్రాల్‌ తగ్గి గుండెజబ్బుల నుండి రక్షణ కల్గుతున్నట్లు పరిశోధనల్లో గమనించబడింది. మానసిక వత్తిడికి జటామాంసీ, తగరవంటి ఔషధాలు బాగా పనిచేస్తున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. పొడపత్రి ఆకు, నేరేడు గింజలు, వేగిసచెక్క డయాబిటీస్‌ నియంత్రణలో ప్రముఖ ఔషధాలుగా ప్రసిద్ధి చెందాయి. సుప్రసిద్ధ ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో నిక్షిప్తమైన 1274 ఔషధాలతో వివిధ వ్యాధుల చికిత్సకొరకై నిర్దేశించబడిన విషయాన్ని సేకరించి ఈ గ్రంథంలో పొదుపరచడమైంది.

Pages : 240

Write a review

Note: HTML is not translated!
Bad           Good