పరిపూర్ణ ఆరోగ్యం అంటే ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రకారం మనిషి సరిరకంగా, మానసికంగా, సామాజికంగా మరియు ఆధ్యాత్మికంగా కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నట్లు, "Mind is the master of the Human body" అని కూడా ఒక నానుడి. అలాగే ఈ సంవత్సరం "మనస్సు బాగుంటే శరీరం బాగుంటుంది" అనే ఆరోగ్య స్లోగాను కూడా ఉత్తమమైనదే. మనిషికి అన్నింటికన్నా ముఖ్యమైన మానసిక స్దిరత్వాన్ని ఈనాడు చాలామంది కోల్పోతున్నారు. అశాంతికి గురవుతున్నారు. పరుగు పందెము లాంటి యాంత్రిక జీవితాన్ని గడుపుతున్నారు మరియు నైతిక విలువల్ని విడనాడి విపరీతమైన మానసిక ఒత్తిడి గురి అవుతున్నారు. ఇతరులతో పోల్చుకోవటం, అసూయా, అసంతృప్తి, కామా, క్రోధ, లోభాలకు గురి అయి మనః శాంతిని కోల్పోతున్నారు. ఇంకొంత మంది జీవితంలోని ఒడిదుడుకులు, సమస్యలు తట్టుకోలేక మానసిక రుగ్మతలకి గురి అవుతున్నారు. కొంతమందికి అనువంసికముగా యిలాంటి రుగ్మతలు సామ్ప్రప్తిస్తున్నాయి. మరి యిలాంటి మానసిక రుగ్మతలు ఎలా ఉంటాయి, వీటికి పరిష్కారం ఏమిటి అని అన్వేషిస్తే..........
Rs.45.00
Out Of Stock
-
+