సంఘపరివార్‌ అమానవీయతపై సునిశిత మార్క్సిస్టు విమర్శ ఈ పుస్తకంలో ఉంది. సంస్కృతి, భావజాలం, రాజకీయార్థిక కోణాల్లో పెచ్చరిల్లుతున్న హిందూ ఫాసిస్టు ప్రమాదంపై విప్లవోద్యమ దృక్పథంతో చేసిన వ్యాఖ్యానం ఇది. వర్గపోరాట చైతన్యంతో 'దేశద్రోహుల' పక్షాన దృఢంగా నిలబడిన వారికే సాధ్యమయ్యే విశ్లేషణను ప్రతి వ్యాసంలోనూ చదువుకోవచ్చు. గత మూడేళ్లుగా ముస్లింలు, దళితులు, సామాజిక ఉద్యమకారులపై సంఘపరివార్‌ దాడులను ఎదుర్కోవడానికి చేసిన ఆలోచనలు ఇవి. మన రాజకీయార్థిక వ్యవస్థతో, బ్రాహ్మణీయ భావజాలంతో కలిపి హిందూ ఫాసిజాన్ని అర్థం చేసుకోవాల్సిన మౌలిక సిద్ధాంత చట్రాన్ని విస్తరించడానికి రచయిత్రి ఈ వ్యాసాల్లో ప్రయత్నించారు. ముఖ్యంగా దేశభక్తి, జాతీయతల చారిత్రక అర్థాలు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి సన్నివేశంలో ఎంత వికృతంగా, అమానుషంగా తయారయ్యాయో కశ్మీర్‌ కల్లోలం నుంచి వివరించారు. ఎప్పటికప్పుడు విడివిడి ఘటనపై రాసిన వ్యాసాలే ఇవి. అయినా వీటి మధ్య ఉన్న సిద్ధాంత ఏకసూత్రత వల్ల హిందుత్వను ఒక అడుగు ముందుకు వెళ్లి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి.

పేజీలు : 119

Write a review

Note: HTML is not translated!
Bad           Good