'మతోన్మాదుల అసహనంపై రచయితల పోరు'' అనే శీర్షికతో డా|| దేవరాజు మహారాజుగారు అద్బుతమైన సంపుటిని అందించారు. భారతదేశంలో పాలనా పగ్గాలు మతోన్మాదుల హస్తగతమైన తర్వాత, బరితెగించి, ఆర్‌.యస్‌.యస్‌. దాని అనుచర గణం కొంత మంది అభ్యుదయ రచయితల మీద, కళాకారుల మీద, హేతువాదులమీద భౌతికదాడికి పూనుకొన్న తర్వాత, దేశంలోని ప్రముక రచయితలు కొంతమంది తమ నిరసనను తెలియజేయడానికి, తాము స్వీకరించిన ''అవార్డులను, రివార్డులను'' తిరస్కరించి, తిరిగి ప్రభుత్వానికి పంపారు. భావస్వేచ్ఛకోసం సాహిత్యకారులు భిన్న రూపాల్లో పోరు సల్పగలరనే సత్యానికి ఇదొక నిదర్శనం. కలం వీరులకు కోపమొస్తే, ఆ కలాలే వేయి గళాలుగా ఎలుగెత్తగలవని ఈ 'వాపసీ' విధానం నిరూపించింది. మేధావుల ఆగ్రహంతో ప్రభుత్వానికి జ్ఞానోదయమయిందా అనే ప్రశ్న ప్రతి అభ్యుదయవాది వేసుకోవాలి. నిరసనాస్త్రాలు ఆషామాషీ వ్యవహారాలుకాదు. అవే నిజాస్త్రాలుగా మతోన్మాదులకు గుణపాఠాన్ని నేర్పగలవు. - గడ్డం కోటేశ్వరరావు

Pages : 71

Write a review

Note: HTML is not translated!
Bad           Good