ఆనంద్ - విజయ్ .. ఈ ఇద్దరి స్నేహం ఒక అపురూపం. వీరి స్నేహం ఎంతమందికి ఈర్హ్యని రేకెత్తిం చింది ! తమకి లేని అదృష్టం ఏదో ఆ ఇద్దరి సొంతం అనిపించేది ! అంట నిజాయితీగా అంత అంకితంగా అంత ప్రేమాభిమాలాలతో కంచుకోటలా ఒకరికి ఒకరు ఉండగలగడం అరుదే, వాళ్ళిద్దరూ ఎకభావంతో, ఇకమత్యంతో ఒకరికి ఒకరు తొడుగా , జంటగా మిగతా ఈ లోకాలని గమనించేవారు.
వాళ్ళ స్నేహాన్ని బద్దలు చేయాలని చాలామంది చూసారు. స్వయంగా దీక్షితుల గారే  ఆయన జీవితం అంతా పోరాటం జరిపి పరాజయం పొందారు.
హేమ విజయ్ తలమీద చేయి వేసింది.
ఒక్క క్షణం తర్వాత రెండు  చేతులతో అతని తలను పొట్టకు అనించుకుంది.
హేమా !! విజయ్ దుఖబారంగా అన్నాడు. అటు ఏడుపుని శక్తి అంతా కూడదీసుకుని నిగ్రహించుకోవడానికి వ్యర్ధ ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది. టని తల నిమురుతూ తగ్గు స్వరంతో అంది. "విజయ్"! ఈ జీవితం నదే ! ఇది ఎప్పుడు మనకి ఏకానుక ఇస్తుందో తెలియదు !
మళ్ళా ఎప్పుడు హథాత్తుగా మన నుంచి మనకి ప్రియమైనది ఏది తీసుకుంటుందో అదీ మనకి తెలియదు ! ఆ అదృశ్య మహాశక్తి మందు తలవంచడమే మన కర్తవ్యం !!
హేమా విజయ్ భార్య నడుం చుట్టూ చేయి పెనవేసాడు. అతనికి హేమ చేతి స్పర్శ ధైర్యం యిస్తోంది.
విజయ్ హేమ, ఆనంద్ వీరి మధ్య చోటు చేసుకున్న అవ్యక్త భావ సంఘర్షణ ఏమిటి ? యదనపూడి సులోచనా రాణి నవల...

Write a review

Note: HTML is not translated!
Bad           Good