సమాజ జీవితం సంక్లిష్టమైన కొద్ది అవేశపరులుఅధికమవుతున్నారు. మానవ సంబంధాలు మంటగలుపుకుంటున్నారు. కోపం, ద్వేషం, అసహనం, అసూయ, నిరాశ, నిస్పృహ, విసుగు, విరక్తి, వ్యథ, వ్యాకులత వంటి హానికర ఆవేశాలు అధికం చేసుకుని అర్థవంతమైన జీవితాలు వ్యర్థం చేసుకుంటున్నారు.
సామాన్య స్థితినుంచి సమున్నతంగా ఎదుగుతున్న కొద్దిమంది సమర్దులను, వున్నా స్థాయిని ఉంచుకోలేక విఫలమవుతున్న అనేకులు అసమర్దులను అంచనా వేసి పరిశీలిస్తే జయప్రదంగా జీవించేందుకు ఈ లక్షణం ఎక్కువ అవసరమో ఇట్టే అర్థమై పోతుంది. వివేకమంతమైన విశ్లేషణ మన బ్రతుకులు బాగు పడేందుకు బ్రహ్మాండంగా ఉపయోగ పడుతుంది.
డెబ్బైఅయిదేళ్ళ నా జీవితానుభవం, వందలాది సద్గ్రంథపఠనానుభవం వడబోసి పాఠక లోకానికి అందిస్తున్న పఠనీయ పుస్తకం ఇది.                                                                                 -కె.రామిరెడ్డి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good