మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో ఒక దళిత కుటుంబంలో జన్మించి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని, పోలీస్‌ ఆఫీసర్‌గా, న్యాయవాదిగా, రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా, కేంద్ర మంత్రిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన శ్రీ సుశీల్‌ కుమార్‌ షిండేగారి సుదీర్ఘ జీవన ప్రస్ధానమే ''అట్టడుగు నుండి అగ్రస్ధానం వరకు' . ఈ విశిష్ట వ్యక్తి జీవిత కథ ఎందరికో స్ఫూర్తిదాయకం.

ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్ర గవర్నర్‌గా వుండి కేంద్ర మంత్రి అయిన సుశీల్‌ కుమార్‌ షిండేగారిని గురించి ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ 'అట్టడుగు నుంచి అగ్రస్ధానం వరకు' పేరిట లఘు జీవిత చరిత్ర గ్రంథాన్ని సంతరించారు. దళిత కుటుంబంలో పుట్టినా కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించిన షిండే గారి జీవితం నేటి యువతు స్ఫూర్తిదాయకం కాగలుగుతుందని...- ఆంధ్రభూమి

విజేతల కథలన్నీ ఒకేలా ప్రారంభం కాకపోవచ్చు. ఒకేరకమైన మలుపులు ఉండకపోవచ్చు. కానీ ముగింపులు మాత్రం దాదాపు ఒకేలా ఉంటాయి. కేంద్ర మంత్రి, గవర్నర్‌...ఒక్కో మెట్టూ ఎక్కుతూ అంతెత్తుకు ఎదుగుతాడు. సుశీల్‌ కుమార్‌ షిండే స్ఫూర్తిదాయక జీవితాన్ని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ వ్యక్తిత్వ వికాస గ్రంథమంత ఉత్తేజకరంగా రాశారు. జీవితంలో గెలవాలనుకునే వారంతా, ముఖ్యంగా యువత చదివితీరాల్సిన పుస్తకం. - ఈనాడు

Write a review

Note: HTML is not translated!
Bad           Good