"ఏమిటి బాధ ?" అంది సరోజ జ్వరం  చూస్తూ,
" నా బాధని భగవంతుడు కూడా తీర్చలేదు! " సీత బిగబట్టిన కంఠంతో అంది.
అంటే సరోజ తెల్లబోతూ అడిగింది .
నీకు తెలియదా ? నిజం చెప్పు, నువ్వు నర్సుగా వచ్చింది నాకు సేవలు చేయటానికా ? లేక నా భర్త ప్రేమని తిరిగి పొందతానికా ?
"సీతా!" సరోజ నిర్విన్నురాలైనట్టు చూసింది.
ఆ పేరుతొ నన్ను పిలువకు. నన్నసలు పేరు పెట్టి పెలిచే హక్కు నీకు లేదు వెళ్ళు అవతలికి ఊ ! ముందు నా కాళ్ళ ముందు నుంచి బయటికి పో !
సీత గట్టిగా కేకలు పెట్టింది.....
కష్టపడి చదువుకుని పైకి వచ్చి పోలీసు ఆఫీసర్ సూర్యానికి చెల్లి సీత ఆరోప్రాణం. ఆమె పెద్దింటి కోడలై అష్టేశ్వర్యాలు అనుభవిస్తూంటే పొంగిపోతాడు. కానీ సీత భర్తకి అంతకు ముందే సరోజ తో సంబందం ఉందని తెలియటంతో కుపితుదవుతాడు. ఆవేశంతో సరోజని నిలదీసెందుకు వెళతాడు. కానీ సరోజ దయనీయ స్థితిని చూసి అతడు కరిగిపోతాడు.
సరోజ మరెవరో కాదు, తమ కెంతో కావాల్సిన మనిషి అని తెలుసుకుంటాడు. ఇంతకీ సరోజ ఎవరు ? అపార్ధాల సుడిగుండాల్లో చిక్కుకున్న వాళ్ళ జీవితాలు గట్టేక్కాయా?అనుబంధాలు ఆత్మీయతలూ అభిమానాలూ ఆప్యాయతలతో అగ్రశేణి రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణి అల్లిన మరో మరుమల్లె పూదండ. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good