ఎక్కడిదా గానం?

ఎవరిదా గొంతు?

అమావాస్య రాత్రి. సముద్రతీరం. అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. తీరం వెంబడి, పిచ్చిగా పరిగెడుతోంది శివాని. ఆ గానం  ఆమెని పిచ్చిదాన్ని చేస్తోంది. ఏదో అనాది దాహాన్ని తట్టి లేపుతోంది. తెలుసుకోవాలి. ఆ సంగీత మూలాల్ని తెలుసుకోవాలి. ఎక్కడ? ఎలా? ఏ భాష? సంగీతానికి మించిన భాషేముంది? మేఘాలు ఘర్జించాయి. సముద్రపు అలలు గొంతు కలిపాయి. ప్రశ్నలు మానేసి పరిగెడుతోంది. అయినా కుబుసం విడిచిన కాలసర్పం ఆమెని కాటు వెయ్యడానికి నోరు తెరుస్తూనే ఉంది. ఈ గానానికి మూలాలు శోధించేదాకా కాలసర్పాన్ని కాలికింద తొక్కి పెట్టి పరుగెడుతోంది. పసిపిల్లలు, పక్షులు, పువ్వులు, సెలయేళ్ళు అన్నీ ఆ మహా సంగీతానికి శృతి కలుపుతున్నాయి.

ఆ గానం తనకే వినిపిస్తోందా? అందరికీ వినిపిస్తోందా? అది వినిపించడం వరమా శాపమా? అదిగో మళ్ళీ ప్రశ్నలు... కాలసర్పం కోరలు సవరించుకుంటున్నట్టుంది.... మళ్ళీ మౌనాన్ని ఆశ్రయించింది.... నిశ్శబ్దంలో ఆ గానం మరింత స్పష్టంగా ... ఆమె నిశ్శబ్దానికి మరింత దగ్గరగా. సంగీతం శబ్దమా? నిశ్శబ్దమా? నిశ్శబ్దం పట్ల ఎరుక కోసం శబ్దమా?

పేజీలు : 119

Write a review

Note: HTML is not translated!
Bad           Good