'మీరంతా అలా ఎందుకున్నారు ? నా గురించి ఎవరూ రాలేదేమిటి ?'' చుట్టూ చూస్తూ అడిగాడు.

'' మీ గురించి ఎవరొస్తారని మీరనుకుంటున్నారు ?''

''ప్రొడ్యూసర్లు, టెక్నీషియన్‌లు, నన్ను మీరెవరూ గుర్తు పట్టలేదా ? నేనూ చైతన్యని.''

''అంటే ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచంలో టాప్‌ స్టార్స్‌లో ఒకరైన చైతన్య మీరని మీ ఉద్దేశ్యమా ?''

''ఉద్దేశ్యమేమిటి ? నాన్సెన్స్‌-నేనే చైతన్యని.''

ఒక నర్స్‌ నవ్వాపుకోలేక మొహం పక్కకి తిప్పుకుంది. కానీ అనుభవజ్ఞుడైన డాక్టర్‌ ముఖంలో విషాదం తొంగిచూసింది. సానునయంగా అన్నాడు. ''చూడు బాబూ! నీ పేరు సుబ్బారావు. బయట నీ భార్యా కూతురూ ఉన్నారు. నీ బ్రెయిన్‌ సెల్స్‌ పూర్తిగా చచ్చిపోక ముందే ఆక్టివేట్‌ చేయడానికి ప్రయత్నించు....''

అతడొక సినిమా హీరో. సినిమా షూటింగ్‌ జరుగుతూ వుండగా ఏక్సిడెంటయి స్పృహ తప్పింది. స్పృహ వచ్చేసరికి అతడు ఆసుపత్రిలో ఉన్నాడు. డాక్టర్లు, నర్సులు అందరూ అతడిని సెక్రటేరియట్‌ గుమాస్తాగా గుర్తించారు. తాను సినిమా హీరోనని నిరూపించుకోవటానికి అతడు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరికి కన్న తల్లి కూడా అతడిని కొడుకుగా గుర్తించటానికి నిరాకరించింది. కారణం ?.....

అడుగడుగునా సస్పెన్స్‌తో ఆద్యంతమూ ఉత్కంఠతో నిండి ఉక్కిరిబిక్కిరి చేసే సస్పెన్స్‌ థ్రిల్లర్‌. అతడే ఆమె సైన్యం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good