ధ్యానసాధన అంటే 'టైం వేస్టు వ్యవహారం' అన్న ఫీలింగ్‌ అనేకమందికి ఉంది. కొందరికి ఏవేవో భయాలు ఉన్నాయి. ఈ రకమైన అపోహలని తొలగించే ప్రయత్నమే యీ 'అతీంద్రియ ధ్యానం'.

ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ నిత్యకృత్యాల్లో తమకి తెలియకుండానే ధ్యాన సాధన చేస్తుంటారు. ధ్యానఫలాన్ని పొందుతూనే ఉంటారు. అయితే 'తాము చేస్తున్నది కూడా ధ్యానసాధనలో భాగమే' నన్న సంగతి వారికి తెలియదు. అది తెలిస్తే ధ్యానం పట్ల వారికున్న సందేహాలు, భయాలు తొలగిపోతాయి. వారు మరింతగా ధ్యాన ప్రయోజనాలు పొందగలుగుతారు.

'ధ్యానం' అందరికీ ప్రయోజనకారి కావాలన్న ఉద్దేశ్యంతో, పురాతన, సనాతన, అధునాతన ధ్యాన పద్ధతుల్ని క్రోడీకరించి భయాందోళనలకి అతీతంగా యీ 'అతీంద్రియ ధ్యానం' మీ ముందుకు తీసుకొచ్చాం.

'ధ్యానం' చెయ్యాలనుకునేవారికి మార్గదర్శి యీ పుస్తకం.

'ధ్యానం' అంటే ఏమిటో మీకు పరిచయం చేస్తుందీ పుస్తకం.

'ధ్యానం' నేర్చుకునే వారికి తొలిమెట్టు యీ 'అతీంద్రియ ధ్యానం'. -     తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు

Write a review

Note: HTML is not translated!
Bad           Good