భార్యని నిర్దాక్షిణ్యంగా హత్య చేసిన హంతకుడు అతడు.
...... ఉరిశిక్షకు ముందు రోజు జైల్లోంచి ఒక ఖైదీ తప్పించుకున్నాడని పేపర్లో చదివిన సిరి దాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. కానీ ఆ తరువాత ఆ హంతకుడు తన ఇంట్లోనే వున్నాడని తెలిసి కంగారు పడింది.

ఇన్ని సంవత్సరాలుగా తనని అజ్ఞాతంగా ప్రేమిస్తున్నాడని, తనని చివరిసారి చూడాలని అతడు వచ్చాడనీ తెలిసి కలవరపడింది. అతడి ప్రేమను చూసి కదిలి పోయింది.

కానీ ఆ రాత్రే అతడు తన భర్త మీద హత్యాప్రయత్నం చేసాడని తెలిసింది. ఎందుకు ?

ఆమె ఆరా తీయడం ప్రారంభించింది. గని త్రవ్వకాల్లో శిధిలాలు బయటపడ్డట్టు ఒక్కొక్క నిజమే బయటపడసాగింది. భయంకరమైన నిజాలూ, మనుష్యుల జీవితాల వెనుక చీకటి రహస్యాలూ తెలిసాయి.

ప్రమాదం ఆమెని వెంటాడ సాగింది.

ఏమిటా ప్రమాదం ? దాని నుంచి ఆమె ఎలా బయటపడింది. తెలుసుకోవాలంటే యండమూరి వీరేంద్రనాథ్‌ రాసిన అతడు ఆమె ప్రియుడు' నవల చదివి తీరాల్సిందే.

Write a review

Note: HTML is not translated!
Bad           Good