Rs.30.00
Price in reward points: 30
Out Of Stock
-
+
జాతీయోద్యమ నవలగా, స్త్రీ పురుష సంబంధాలను చర్చించే నవలగా 'అతడు-ఆమె'కు తెలుగు సాహిత్యంలో విశిష్టమైఊన స్థానం వున్నది. జాతియోద్యమాన్ని గురించి కేవలం ఆవేశంతో ఉత్సాహంతో రాసిన నవల కాదు. జాతీయోద్యమాన్ని గురించి ఎంతో అధ్యయనం చేసి రాసిన నవల. 'అతడు-ఆమె' నవలలో లక్ష్మణరావుగారు ఎన్ని విషయాలనో చర్చించారు. ఎన్ని విషయాల గురించో మన కళ్ళు తెరిపించారు. ఐతే ఈ నవల మొత్తంగా సాధించిన ప్రయోజనం ఏమిటీ? ఆ నవల ప్రభావం పాఠకుడిపై ఎలా ఉంటుంది? ఈ నవల చదవక ముందూ, చదివిన తర్వాత పాఠకుడి మనసులో వచ్చే మార్పులేమిటి అని ఆలోచిస్తే, 'అతడు-ఆమె' నవల పాఠకుల సంస్కారాన్ని పెంచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఆ నవల చదివే వ్యక్తులు కొంచెం నిజాయితీ ఉన్నవారైతే చాలు - ఆ నవల చదివాక ఎంతగానో సంస్కరించబడతారు.