విగ్రహం!సతీష్ చూసిన విగ్రహం. ఆ తర్వాతే కనిపించకుండా అంతర్ధానమయినట్లుగా తెలుస్తుంది. తానుకూడా… ఏదో ప్రమాదంలో చిక్కుకోబోతుందా? బయలుల్దేరే ముందు అసిస్టెంట్ డైరక్టర్ చెప్పిన విగ్రహం ఇదికాదుకదా. చిన్నగా తలూపింది.
కుర్చీలోంచి లేచి నిలబడిన జయసింహ, ఓ పక్కగా పైనుంచి కిందివరకూ వేలాడదీయబడిన కలంకారీ కర్టెన్ ను తొలగించాడు. ఆవైపు చూసిన మోహిత,ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి మరీ చూసింది. మూడు అడుగులు ఎత్తున్న ప్రతిమ అది. కోపంగా,భయంకరంగా చూస్తున్నట్లున్న ఉగ్రనరసింహమూర్తి విగ్రహం. పూర్తిగా మేలిమి బంగారంతో చేయబడినట్లుగా గది మధ్యలో వేలాడుతున్న దీపం వెలుగులో పచ్చగా మెరుస్తొంది.
“ఈ విగ్రహం గురించే… నాతో  మాట్లాడాలి అని చెప్పాడు సతీష్ ఫోన్లో…”అంటున్న జయసింహ మాటలు విని, మళ్ళీ ఈలోకంలోకొచ్చింది మోహిత.”సతీష్…మిమ్మల్ని కలిశాడా?”అనే ప్రశ్న మోహిత మనసులో ఉదయించి కంఠంద్వారా పయనించి పెదవుల్ని చేరబోయేంతలో-
బయటగదిలో ఎవవరివో పాదాల చప్పుడు,ఏదో అలికిడి స్పష్టంగా వినిపించింది.జయసింహ చురుగ్గా కదిలాడు…
జయసింహ ఏం చేయబోతున్నాడు? సతీష్ ని వెతకటానికి వెళ్ళిన మోహిత అతని ఆచూకి తెలుసుకోగలిగిందా? అవి తెలుసుకోవాలంటే ఈ నవల చదవాల్సిందే!

Write a review

Note: HTML is not translated!
Bad           Good