యజ్ఞభూపతి ప్రపంచంలో అన్నిటికన్నా, ఆఖరికి గుర్రాల కన్నా ఎక్కువగా ప్రేమించేది తన కొడుకునే.
అలాంటి తన కొడుకు తనంతట తాను కాల్చుకొని చనిపోవటం బాగా కృంగదీసింది. కొడుకు చనిపోయినట్లు రాత్రి 1-30 కి తెలిసింది. తెలిసిన అరగంటకే ఆ క్లబ్ నామరూపాలు లేకుండా మాడి మసైపోయింది.
“ఎలా జరిగింది...?” భూపతి నోటివెంట ఒక్కొక్క మాట ఒక్కో నిప్పురవ్వలా వస్తోంది.
“నేను ఎంక్వైరీ చేయించిన మేరకు ఇది శశాంక పనే అని అనిపిస్తోంది.”
"అనిపించటమేనా, ఆధారాలున్నాయా?”
ఆ నిశిరాత్రివేళ భరత్ ప్రళయరుద్రుడిలా అవతారం ఎత్తాడు. గాఢ నిద్రలో వున్న శంకర్ రెడ్డి లేచి భరత్ ని ఆ రూపంలో చూసి వణికిపోతున్నాడు.
“చెప్పు. నా జన్మరహస్యం తెలిసింది అంకుల్ కీ, నీకే. ఆయనెలాగూ చెప్పరు. నీవైనా చెప్పు...” గర్జించాడు భరత్.
శంకర్ రెడ్డికి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. నోటిమాట రాక ఒణికిపోతున్నాడు. ఆ పరిస్థితి ఎప్పుడో ఒకప్పుడు వస్తుందని తెలిసినా అంత త్వరగా వస్తుందని మాత్రం వూహించలేదు.
చెబితే శుక్రాచార్య నిర్ధాక్షిణ్యంగా చంపేస్తాడు. చెప్పకపోతే భరత్ వూరుకోడు. చెప్పకపోతే భరత్ ద్వారా రాగల ప్రళయం ఆగిపోతుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good