నెంబర్‌ 1947 సంతోషాబాద్‌ పాసింజెరు

కంపార్టుమెంటు ద్వారం దగ్గరి కెప్పుడొచ్చానో నాకు తెలియదు. నేనే కదిలానో, లేకపోతే వెనక వాళ్ళు తోయడంతో ముందుకొచ్చి, యీ కంపార్టుమెంటులోకి పడ్డానో, నాకు తెలియదు. కూచోడానికి స్థలం కోసం వెతుక్కుంటూ వుండగానే గార్డ్‌ వేసిన విజిల్‌ వినిపించింది. రైతు భీకరంగా ఘీంకరించింది. ముందుకూ వెనక్కూ వూయల్లా కాస్సేపు వూగి, వెనక్కే వెళ్లిపోతుందేమోనని ప్రయాణీకులందరూ కంగారు పడిపోయేటంత వరకూ వెనక్కే నడచి, ఆ తర్వాత చిత్ర విచిత్రమైన సవ్వడులు వెలిగక్కుతూ, మెల్లగా, బరువుగా, ముందుకు కదిలింది రైలు. ఆత్రుతతో జేబులోకి చేయి పెట్టి చూశాను. పర్వాలేదు. యింటర్వ్యూ కాగితం పదిలంగానే వుంది......

Write a review

Note: HTML is not translated!
Bad           Good