జయదేవుడు

మహాకవి జయదేవుడు 11, 12 శతాబ్దాల మద్య కాలము వాడని చెప్పవచ్చు. భోజదేవుడు ఇతని తండ్రి, రామాదేవి తల్లి. ఆ ఇద్దరికీ వరప్రసాదం వల్ల ఇతడు జన్మించాడట. అందుకే ఇతడికి జయదేవుడు అని పేరు పెట్టారట.

పూరీ జగన్నాధానికి దగ్గరలో వున్న తిందుబిల్వం ఇతని జన్మ స్థలం. ఒరిస్సా రాష్ట్రంలోని లక్ష్మణసేనుడి ఆస్థానంలో ఇతను వుండే వాడని ప్రతీతి.

భారతదేశంలోని సాహితీ ప్రియులందరికీ ఎంతో ఇష్టమైనవి ఈ అష్టపదులు. అన్ని భాషలవారు ఈ గోత గోవిందానికి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చారు.

పద్మావతి ఇతని భార్య, ప్రేయసి. కొందరు పండితులు ఈమె భార్యకాదని వాదిస్తున్నారు. జయదేవుడు గీత గోవిందం ఆలపిస్తూవుంటే పద్మావతి నృత్యం చేసేదట.

ఆయనది గానం. ఆమెది నృత్యం. అతనిది భావం. ఆమెది లాస్యం. అతనిది కననం. ఆమెది నటనం. ఎవరేమని వాదించినా సంగీత సాహిత్య సమ్మేళనం ఆ జంట. అందుకే జయదేవుడు తనని ''పద్మావతీ చరణ చారణ చక్రవర్తి''గా చెప్పుకున్నాడు.

ఈ కావ్యంలో 24 తరంగాలు, 78 శ్లోకాలు వున్నాయి. మదుర భక్తికి ఈ కావ్యం మహత్తరమైన ఉదాహరణ. శ్రీహరిని సర్వశృంగార మూర్తిగా ఉపాసించారు జయదేవుడు. అంతర్గతంగా అష్టవిధ నాయికా వర్ణన వుంది.

పేజీలు : 112

Write a review

Note: HTML is not translated!
Bad           Good