మన భారతజ్ఞ్మయంలో వేదాల తరువాత అంతటి ప్రాశస్త్యాన్ని పొందిన గ్రంథాలు పురాణాలు. వేదాల్లో చెప్పిన ధర్నాల్ని కథలరూపంలో, ఆఖ్యానాల రూపంలో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా తెలియచెప్పేవే పురాణాలు. అందుకే పురాణాల్ని పంచమవేదంగా కీర్తించారు. అసలు పురాణం అంటే? పురా పినవం-పురాతనమైనప్పటికీ నూతనంగా వుండేది అని అర్థం. అలాగే 'పురా ఆనతి' అంటే ప్రాచీనకాలంలో జరిగింది అని, వాయుపురాణం పురాణ శబ్దాన్ని నిర్వచిస్తే, 'పురాఏతత్‌ అభూత్‌' పూర్వం ఇలా జరిగింది అని బ్రహ్మాండ పురాణం పురాణ శబ్దానికి అర్థాన్ని చెబుతుంది.  వీటన్నిటినీ క్రోడీకరించి చూస్తే పురాణం అంటే పూర్వకాలంలో జరిగిన ఎన్నో విషయాల్ని వివరించి చెప్పేది అని తెలుస్తోంది.

పురాణాలు మహాపురాణాలు, ఉపపురాణాలని రెండు విధాలుగా వున్నాయి.

అష్టాదశ పురాణాలు : 1. బ్రహ్మ పురాణం 2. పద్మ పురాణం 3. విష్ణు పురాణం 4. వాయు పురాణం 5. భాగవత పురాణం 6. నారద పురాణం 7. మార్కండేయ పురాణం 8. అగ్ని పురాణం 9. భవిష్య పురాణం 10. బ్రహ్మవైవర్త పురాణం 11. లింగ పురాణం 12. వరాహ పురాణం 13. స్కాంద పురాణం 14. వామన పురాణం 15. కూర్మ పురాణం 16. మత్స్య పురాణం 17. గరుడ పురాణం 18. బ్రహ్మాండ పురాణం అనే ఈ 18 గ్రంథాలను విడివిడిగా సాధారణ పాఠకుడు కూడా అర్ధం చేసుకోగలిగేంత చక్కని వచనంలొ అందించారు రచయిత జయంతి చక్రవర్తి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good