అవదాన అనేమాటకు ధర్మాన్ని బోధించటం ద్వారా మనస్సుని పరిశుద్ధంచేసే పవిత్రగాథ, ఇతిహాసం, కర్మవృత్తం, మొదలైన అర్థాలున్నాయి. వినేవారి హృదయాన్ని తాకి, వారి మనస్సుల్లో ధర్మపరివర్తన కలిగేటట్లుగా ప్రఖ్యాతపురుషుల జీవన ఘట్టాలను వర్ణించటం దీని ప్రధానలక్ష్యం.

ఈ దృష్టితో చూసినపుడు అశోకావదానం తన లక్ష్యాన్ని పూర్తిగా సాధించిందని చెప్పవచ్చును. కాళ్లూ, చేతులూ నరికివేయబడి శ్మశానంలో వాసనదత్త చనిపోవటానికి కొంతముందు ఉపగుప్తుడు ఆమె వద్దకుపోయి ఆమెలో మార్పు తెచ్చినతీరు, దిగ్భ్రాంతిని కలిగించే వీతశోకుని మరణం, కంటతడి పెట్టించే కునాలుని ఉదంతం, చివరిరోజుల్లో దారిద్య్రంలోకి నెట్టబడి చివరికి తనవద్ద మిగిలిన సగం ఉసిరికాయను సంఘానికి పంపుతూ అశోకుడు పలికిన మాటలు ఎవరి హృదయాన్ని కదిలించవు! అవదాన కల్పలతలో ఉన్నట్లుగా ఇందులో సుదీర్ఘమైన వర్ణనలు లేవు. రచయిత చిన్న చిన్న వాక్యాల్లో సరళంగా విషయాన్ని వివరించాడు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good