మన తెలుగింటి ఐకాన్ సూర్యకాంతంగారు. ఎంత గయ్యాళి అయినా తెలుగువారి గుండెల్లో గూడు కట్టుకుని స్థిరపడిపోయింది.
కారణం ఆవిడ మాట పెళుసు అయినా, మనసు పసిపిల్ల మనసులాంటిది.
చేతులు, మూతులు తిప్పుతూ కంచు కంఠంతో అరవడం తప్ప పాలల్లో విషాలు, అన్నంలో యాసిడ్ కలపడం తెలియని అమాయకురాలు.
అందుకే ఆ అత్తగారు కాలగర్భంలో కలిసిపోయినా ఆవిడ జ్ఞాపకాలు ప్రతి తెలుగువారి గుండెల్లో పవిత్రంగా, పదిలంగా నిలిచిపోయాయి.
మరి ఇప్పుడు బుల్లితెర మీద కనిపించే ఆధునిక అత్తగార్ల చేతిలో ఏకంగా యాసిడ్ సీసాలు, కాలకూట విషాలు, చిటికె వేస్తే రివ్వున వాలిపోయే వందమంది రౌడీలు, కళ్ళల్లో పగ, కసి, క్రౌర్యం, నీచత్వం...!
కోడళ్ళు తక్కువ తిన్నారా! బుర్రనిండా చూసేవాళ్ళ బుర్ర తిరిగిపోయే లాంటి ఎత్తులు, జిత్తులు... ఇంక ఆడపడుచులు, సవతులు, వియ్యపురాళ్ళు, పక్కింటివాళ్ళు, పనివాళ్ళు... బాప్రే.. ఒకళ్ళను మించి ఒకళ్ళు...
ఒంటిమీద డిజైనర్ జాకెట్లు, అరచేతి మందాన మేకప్పులు, పెదాలనిండా లిప్స్టిక్లతో బహు సుందరంగా కనిపించే ముద్దుగుమ్మలు... అష్టావక్ర నాయికలై మా సుబ్బలక్ష్మి గారి ముంగిట్లో కొలువుతీరారు. సరదాగా వాళ్ళని పలకరిద్దామా! రండి...!
పేజీలు : 142