పురాణములు పదునెన్మిదినీ వ్యాసమహాముని రచించెను. వ్యాసుడను వా డొక్కడుకాదనియు, అదియొక పీఠమనియు, ఆ పీఠమునెక్కిన మహనీయుడు వ్యాసుడనబడుచుండుననియు కొందరందురు. ఏది యెట్లున్నను మన భారతీయ సంస్కృతిని తీర్చిదిద్ది గ్రంథరూపముగా నొనరించిన వ్యాసభగవానుడు భారతీయులకు సర్వదా పూజనీయుడు.

వేదసారమై ''పంచమ'' వేదమనబడు మహాభారతము, అందు నుపనిషత్సారమగు భగవద్గీత - యివియన్నియు సర్వకాల సర్వావస్థల యందునా మానవజన్మ తరించుటకు సాధనములై పరమేశ్వరతత్త్వము ప్రకటించుచూ యుగయుగాలనుండి లోకోద్ధరణము గావించుచున్నవి.

అటువంటి గ్రంథములగు పురాణములు-స్కాందము, లింగము, పద్మపురాణము, బ్రహ్మాండపురాణము, బ్రహ్మవైవర్తము, వరాహ పురాణము, మార్కండేయపురాణము మొదలగు మహాపురాణములు పదునెన్మిది రచించెను. పురాణములు సర్గ, ప్రతిసర్గ, వంశ, వంశాను చరితాదులగు లక్షణములతో నుండు మహాగ్రంథములు. అన్ని గ్రంథములు వరుసగా చదువుటకు గాని, వినుటకుగాని సావకాశము దొరకదు. కావున వాటి సారముగా చదువుటకు కథాంశములు విడువకుండా యీ గ్రంథరూపమున చదువరులకు నందించ సంకల్పించారు గ్రంధ రచయిత.

Write a review

Note: HTML is not translated!
Bad           Good