క్రీ.పూ. 3వ శతాబ్దంలో మౌర్యవంశ స్థాపకుడైన చంద్రగుప్తుని మనుమడుగా జన్మించి తండ్రి బిందుసారుని వారసుల పోరాటంలో గెలిచి చండశాసనుడుగా పేరు పొందాడు.

అయితే అంతటి విస్తీర్ణ సామ్రాజ్యపు మధ్యలో వున్న కళింగపై యుద్ధం చేసి లక్షలాది సైనికుల మరణానికి కారకుడై ఆ స్మశాన భూమిని చూసి ఖిన్నుడై ఖడ్గంతో కాక శాంతి, అహింసలవల్ల మాత్రమే సామ్రాజ్య సుస్థిరత సాధ్యమని తలచాడు. అలాటి సామ్రాజ్య స్థాపనకు అతడు వర్గ రహిత సమాజాన్ని బోధించే బౌద్ధమతాన్ని స్వీకరించి ఆ మత వ్యాప్తికి దాని ద్వారా వర్గరహిత సమాజ నిర్మాణానికి ప్రయత్నించాడు.

కుమారుడు మహేంద్ర, కుమార్తె సంఘమిత్రలను బౌద్ధమత వ్యాప్తికి శ్రీలంక పంపడమేకా యెందరో బౌద్ధమత ప్రచారకులను ఇటు దక్షిణా పథానికి అటు ఆసియా, ఐరోపాలోని గ్రీస్‌ వరకూ పంపాడు. తన దర్మ నీతిని తెలియజేయడానికి తన సామ్రాజ్యమంతా, సామ్రాజ్య హద్దులలో స్థూపాలు, స్తంభాలు పాతి ధర్మశాసనాలు రాయించాడు. రాతి గుహల్లో, కొండలపై శాసనాలు రాయించాడు. అతడి గొప్పదనానికి నిదర్శనంగా భారతదేశ స్వాతంత్య్రానంతరం అతడి స్థూప మకుటం సింహాల చిహ్నాన్ని రాజముద్రగా, అతడి ధర్మచక్రాన్ని భారత జెండాలో ఇముడ్చుకుంది.

Pages : 104

Write a review

Note: HTML is not translated!
Bad           Good