చర్చ, వాదం, తర్కం, విమర్శ, పరిశీలన - ఇవన్నీ దాదాపుగా ఒకటే. అన్నీ హేతు వాదాన్ని ఆధారం చేసుకుంటూ సాగవలసినవే. అందరూ, హేతువు (కారణం) మీదే సాగితే, ఏ చర్చ అయినా చాలా తొందరగా ముగుస్తుంది. అప్పుడు అందరికీ ఒకే అభి ప్రాయం స్తిరపడుతుంది.

కానీ సమస్యల సంగతి అలా కాదు. సమస్య ఎంత చిన్నది అయినా, అసలు, 'సమస్య' తలెత్తిందీ అంటే, అందులో వేరు వేరు పక్షాలు వుంటాయి. సమస్యని అవి చూసే విధానాలూ, వాటి పరిషారాలూ, పరస్పర వ్యతిరేకంగా గానీ, కనీసం భిన్న భిన్నంగా గానీ, వుంటాయి.

నిజానికి, ఒక 'చర్చ'లో వున్న వాళ్ళు, తమకు అప్పటికే వున్న భావాల్నీ, తమ విశ్వాసాల్నీ, తమ లాభాల్నీ, తమ ఇష్టాయిష్టాల్నీ, అలాంటి వన్నీ తీసి పక్కన పెట్టాలి. కానీ, మనుషుల్లో మెజారిటీకి, ఆ దృష్టి ఇంకా అలవడలేదు. ఇంకా అలవాటవలేదు.

ఈ సంపుటంలో వున్న 4 పుస్తకాల మీద చర్చల్లోనూ అనేక మంది పాటించిందంతా తర్క రాహిత్యమే.

Write a review

Note: HTML is not translated!
Bad           Good