క్రీస్తుకు మూడువందల సంవత్సరాలకు పూర్వమే యీ దేశమున స్వాతంత్ర వాంఛతో తక్షశిలా విద్యాలయములో ఆచార్యునిగా వున్న భవిష్యత్ దర్శనకారుడు సర్వశాస్త్ర నిష్ణాతుడు, మంత్ర, తంత్ర నిపుణుడు అర్థశాస్త్ర, కామనీతిశాస్త్ర రచయిత మహా మేధావి ముఖ్యంగా ఆంధ్రుడు అయిన ఆచార్య చాణక్యుడు భారత జాతికై గ్రీకుల దండయాత్రకు లోనై తమ దేశము, ధర్మము తనకు మిగలని పరిస్థితిలో అవతార పురుషునిగా జన్మించి కత్తిపట్టక తన అమోఘ మేధా సంపత్తితో గ్రీకుల యీ పుణ్య భూమి నాక్రమింపకుండ అసమాన్య రాజనీతి నుపయోగించి భరత జాతికి ఏ కాలంలోనూ, ఏ తరంలోనూ ఎవ్వరూ చేయని మహోపకారం చేసిన మహాపురుషునిగా చరిత్ర ప్రసిద్ధుడైన చాణక్యులవారి జీవితం ఆనాడు మన భారతభూమి కొరకు పడిన శ్రమ అర్థశాస్త్ర రచన ధురీణత యిందలి కథ.
ఈ మహాపురుషునికే విష్ణుగుప్తునిగా, కౌటిల్యునిగా, వాత్స్యాయనునిగా, మల్లినాథునిగా, పక్షులస్వామి యని పేర్లున్నవి.
పేజీలు : 306