తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించిన పోటీలో ఉత్తమ పరిశోధన వ్యాస నిబంధంగా ఎంపికైన ''కూచిపూడి నాట్య విశిష్టత'' సిద్ధాంత గ్రంథం నాట్య కళాకారులకు, రస హృదయులకు, పాఠకులకు ఎంతో ఉపయోగపడుతుంది.

కూచిపూడి నాట్య చరిత్రను, కళాప్రాచీనతను, ఆ కళాకారుల వలసను, వారు ఆర్జించిన అగ్రహారాన్ని, నాట్య పరిణామమును, దాని  విశిష్టతను, నాట్యశాస్త్రానుశీలనమును, భామాకలాపం - భరతశాస్త్ర సంబంధాన్ని, దశావస్థలు, యక్షగానం ఊసు, తెలుగువారి యక్షగాన కళకు ఆద్యుడు సిద్దేంద్రయోగి; భామాకలాప పరమార్థం మొదలగు అనేక అంశాలతోపాటుగా చతుర్విధాభినయాలు, యక్షగాన ఛందోవైవిధ్యం, కళా పాఠాలు, నృత్యాంశాలు, అలానే సంకీర్తనలు, అష్టపదులు, జావళీలు, తరంగాలు మొదలైన కూచిపూడి నాట్య సాహిత్యాంశాల విషయాలతో అద్దంలో కొండను చూపినట్లుగా విషయ సంగ్రహంతో క్లుప్తంగా ఈ పరిశోధన వ్యాసాన్ని వ్యాసకర్త వ్రాశారు.

''కూచిపూడి నాట్య విశిషటత'' అను పరిశోధనా వ్యాసాన్ని ఎంతో పరిశ్రమతో, పరిశోధనా ప్రావిణ్యంతో విశ్లేషించి వ్రాసిన డా|| చింతా రామనాథం గారు అభినందనీయులు. - తాళ్ళ వెంకటరెడ్డి

Write a review

Note: HTML is not translated!
Bad           Good