గానానికి, అభినయానికి సరిసమానంగా ఉపయోగపడే సంగీత రచనలు జావళీలు. వీటి రచన 19వ శతాబ్దం నుండే మొదలయ్యింది. రక్తికి పేరుగాంచిన దేశి రాగాలు ఫరజ్‌, జంజోటి, కాపి, బేహాగ్‌, హమీర్‌కల్యాణి వంటి రాగాలలో వీటికి స్వరరచన చేస్తారు. తెలుగు వాగ్గేయకారులే కాకుండా తమిళ, కన్నడ వాగ్గేయకారులు కూడా తెలుగులోనే జావళీలు రచించారు. కర్ణాటక సంగీతానికి సరైన మాధ్యమం తెలుగే అని జావళీలు సైతం నిరూపించాయి.

గాయకులు సంగీతసభలలో జావళీలను పాడి శ్రోతలను ఆనంద పరిచారు. నాట్యకళాకారులు వీటిని అభినయించి వీక్షకులను సమ్మోహితులను చేశారు. మనోరంజకమైన విశిష్ట సాంస్కృతిక ప్రక్రియగా మొదలై సాహితీ కళాసంపదగా జావళి వర్థిల్లింది.

పేజీలు : 200

Write a review

Note: HTML is not translated!
Bad           Good