''నారాయణ'' ఈతండు రోగియొక్క దూత, ఇందు ప్రధమాక్షరము 'న' అనునది, ఈ 'న' 4వ కోష్ఠమునందుగలదు. ఈ కోష్ఠమునందుగల యక్షరంబులు ఆరిటిని, క్రిందగల 4 సంఖ్యను కలపగా 10 అయినది. దీనిలో ఎనిమిదవభాగము 1.25, లేక 1 1/4 అయి ఉన్నది.

 ''వాసుదేవుడు'' ఈతడు రోగి, ఇందలి ప్రధమవర్ణము ''వా'' అనునది 6వ కోష్ఠమునందు గలదు. ఆ కోష్ఠమందలి 5 వర్ణములును, క్రిందనున్న 6 అనుదానిని కలపగా 11 వచ్చినది, ''ఏక మేవాతు రేయుక్త్వా'' అను ప్రకారము దీనిలో 1 అనుదానిని కలుపవలెను. అనగా 12 అయినది దీనిలో ఎనిమిదవ భాగము 1 1/2 అయినది. ఇప్పుడు దూతయొక్క అంకముకంటే రోగి యొక్క అంకము అధికగానున్నదిగాన రోగికి శుభంబగును.

Write a review

Note: HTML is not translated!
Bad           Good