దేశంలో ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టి రెండు దశాబ్దాలు గడిచాయి. ప్రభుత్వాలు మారినా, ఆర్ధిక సరళీకరణ విధానాలలో పెద్దగా మార్పురాలేదు. ఈ సంస్కరణలు ప్రారంభించిన దగ్గరనుండి కొంతమంది ఆర్ధిక శాస్త్రవేత్తలు విమర్శనాత్మకంగా పరిశీలిస్తూ వస్తున్నారు. నేను యీ సంస్కరణల ప్రభావం మన దేశ సామజికరంగాలపై ఎటువంటి ప్రభావం చిపిస్తున్నాయో వివరిస్తూ మీ ముందుంచుతున్నాను. కె.యస్. చలం--- ఇప్పటికి 26పుస్తకాలు ఇంగ్లిష్ లో, తెలుగులోను ప్రచురించారు. కొన్ని వందల వ్యాసాలు తెలుగు దిన పత్రికల్లో ప్రచురించిన చలం, తెలుగు పాఠకులకు చిరపరిచితులు. ఈయన వ్రాసిన 'రీడింగ్స్ ఇన్ పొలిటికల్ ఎకనామి', ఇటివల ప్రచురితమైన 'ఎకనామిక్ రిఫార్మస్ అండ్ సోషియల్ ఎక్స్ క్లూజన్'కు దేశ విదేశాలో ప్రశంసలందుకున్నారు. ది హన్స్ ఇండియా ఇంగ్లిషు దినపత్రికలో ప్రతి సోమవారం రాస్తున్న ఆయన వ్యాసాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. |