టక్కున ఆగి కళ్ళు చిట్లించుకుని చూశాడు సహజంగా ధైర్యవంతుడైన నట్వర్‌సింగ్‌. కానీ అప్పటికే ఆలస్యమయింది.

అతని చేతులు రైఫిల్‌ను బలంగా పట్టుకుని పైకెత్తబోతుండగా అడవి దద్దరిల్లేట్లుగా గాండ్రించిన మేనీటర్‌ కుడిపక్క నుంచి అతనిపైకి దుమికింది. పాయింట్‌ బ్లేంక్‌గా ట్రిగ్గర్‌ నొక్కడంతో తూటా ఓ చెట్టుకు రాసుకుపోయింది. తప్ప పులి గమనాన్ని ఆపలేకపోయింది.

నేలపై వెల్లకిలా పడిన నట్వర్‌సింగ్‌ కుడిజబ్బ పంజాదెబ్బతో వేరైపోయింది.  తుపాకీ నేలపై పడింది.

''తులసీ పారిపో...!'' అదే నట్వర్‌సింగ్‌ అన్న చివరిమాట పెద్దపులి తులసిపై విరుచుకుపడే ప్రయత్నాన్ని నిరోధిస్తూ ఎడమ చేతితో శక్తిని కూడగట్టుకుని పులి మెడని పట్టుకున్నాడు. మరుక్షణం అతడి కంఠం పదునైన పులిగోళ్ళ తాకిడికి చీలి రక్తం వాగులా బయటికి చిమ్మింది.

కొన్ని క్షణాల వరకూ తనను సందిట బంధించిన అతని చేతులు నిర్జీవంగా నేలపై పడగానే... శవాన్ని నోట కరుచుకుని సమీపంలోని పొదల్లోకి పులి దూసుకుపోతుంటే దిక్కుతోచని దానిలా నిలబడ్డ తులసి నిస్సహాయంగా అరణ్య రోదన చేసింది.

ఆ అర్ధరాత్రివేళ... అడవంతా గగ్గోలు పెడుతున్న పసికందు ఆక్రందనలా వినిపించినా, పల్లె ప్రజలు పులి రక్కసి బారి నుంచి నట్వర్‌సింగ్‌ తమని రక్షించాడనుకున్నారు గానీ, పులిచేతనే అతడు వేటాడబడ్డాడని ఊహించలేకపోయారు.

చనిపోయిందని ఊపిరి పీల్చుకున్న గ్రామప్రజలకు మేనీటర్‌ బ్రతికే ఉందనే నిజం ఎలా తెలిసిందో, తర్వాత బలైనవారెవరో తెలియాలంటే చదవండి శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు రాసిన అరణ్యకాండ నవల.

Write a review

Note: HTML is not translated!
Bad           Good