ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేసి మనకు 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారతదేశాన్ని సాధించి పెట్టారు. ఆ మహానుభావులందరకు హృదయపూర్వక వందనాలు. 65 సంవత్సరముల నుండి మనము భారతదేశంలో స్వతంత్రులుగా జీవిస్తున్నాము. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో రంగాలలో ఎంతో అభివృద్ధిని సాధించాము, సాధిస్తున్నాము కూడా. ఆ నేపధ్యంలో మనం భారతీయులమైయుండి మన భారతదేశం గురించి పూర్తి సమాచారం తెలుసుకొని ఉండటం మన కర్తవ్యం కూడా! పిట్టకొంచెం కూత ఘనం అన్నట్లు ఈ చిన్న పుస్తకంలో భారతదేశానికి సంబంధించిన అత్యంత విలువైన సంపూర్ణ సమగ్ర సమాచారం ఇందులో పొందుపరచబడింది.
ఈ గ్రంధం ఎ.పి.పి.ఎస్‌.సి. నిర్వహించు గ్రూప్‌-1 పరీక్షల నుండి గ్రూప్‌-4 పరీక్షల వరకు, మరియు ప్రభుత్వం వారు నిర్వహించు అన్ని రకాలైన పోటీ పరీక్షలకు ఇది ప్రత్యేకం. మీ చేతులలో ఉన్న ఈ పుస్తకం ఒక పెద్ద విజ్ఞానసరస్వం. సుఫలితాలు అందించే కల్పవృక్షం. ఉద్యోగార్ధులకు, విద్యార్ధులకే కాదు, భారతదేశం గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి భారతీయునికి కూడా ఈ పుస్తకం ఎంతో ఉపయోగకరం. ఒక్కొక్క పేజీలో ఒక్కొ రాష్ట్రానికి సంబంధించిన సమగ్ర సమాచారం, రాష్ట్రాల వారీగా 2011 జనాభా లెక్కల వివరాలు ఇందులో పొందుపరచబడింది.
ఈ సమాచార సేకరణలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొన్నాము. అయినా చిన్న చిన్న పొరపాట్లు జరుగవచ్చు. అట్టి వాటిని విజ్ఞులు దయతో తెలియజేస్తే మలి ముద్రణలో సవరించగలము. ఈ పుస్తక రచనలో నాకు ఎన్నో గ్రంథాలు ఉపయోగపడ్డాయి. ఆయా గ్రంథాల మూల రచయితలకు, ప్రచురణకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good