పరమేశ్వరుడి సాక్షిగా, గురువుల పాదాల సాక్షిగా, నాకు ప్రాణభిక్ష పెట్టి విద్యలు బోధించిన గురువుల ఆజ్ఞను - ఏ సందర్భంలోను మీరను. ఎన్ని కష్టాలు కలిగినా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా- గురువులు నిర్ణయించిన క్రతువును విధిగా పూర్తి చేస్తానని ప్రమాణం గావిస్తున్నాను. అంతటితో బాలమహర్షి పూర్తిగా తృప్తి చెందాడు.

'చింతామణీ! నిన్ను వివాహం చేసుకునే వాడికి కొన్ని అర్హతలు కావాలి. అతను మహామేధావీ, అధిక ప్రజ్ఞావంతుడూ, పరార్రకమోపేతుడూ అయి ఉండాలి. నేను నీకు కొన్ని ప్రశ్నలు చెబుతాను. నిన్ను పెళ్ళి చేసుకోవాలని వచ్చే రాజకుమారులని నువ్వు ఆ ప్రశ్నలడగాలి. వాటికి సరైన జవాబులు చెప్పగలిగిన వాడిని మాత్రమే నువ్వు వివాహం చేసుకోవాలి. చెబుతానని వచ్చి చెప్పలేకపోయిన రాజకుమారుడి శిరస్సును ఖండించి కోటద్వారానికి వేలాడదియ్యాలి. ఈ నీ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పగలిగిన రాజకుమారుడు వచ్చి నిన్ను పరిణయం ఆడేవరకూ నువ్వీ శాంతిభవనం నుంచి బయటకు అడుగు పెట్టకూడదు. నీ చెలి శోభ నీతో ఉండొచ్చు. ఈ సమాచారాన్ని దేశదేశాలూ చాటించి రాజకుమారులందరికీ తెలిసేటట్లు చెయ్యాలి''. చింతామణి గురువులు పలికిన ప్రతి అక్షరాన్ని మెదడుకి పట్టించుకుని ఆలోచించసాగింది.

'రాజకుమారీ! ఇదీ నీ వ్రతవిధానం. నీ ప్రశ్నలకు జవాబు చెప్పగలనని వచ్చి, యజ్ఞవేదికపై నిలబడి, జవాబులు చెప్పలేక అపజయం పొందిన రాజకుమారుడు నీకు బంధువు కానీ, స్నేహితుడు కానీ, నిస్సంకోచంగా నీ కరవాలంతో అతని శిరస్సును ఖండించి తీరవలసిందే'' అన్నాడు బాలమహర్షి- చింతామణి తనను వివాహం చేసుకోగోరి వచ్చిన రాకుమారులని అడిగి ప్రశ్నలేమిటి? వాటికి సమాధానం చెప్పలేక శిరస్సులు ఖండింపబడ్డ వారెండరు? సరియైన సమాధానాలు చెప్పిన రాకుమారుడెవరు? ఈ వివరాలన్నీ శ్రీ ఇచ్ఛాపురపు రామచంద్రంగారు రాసిన సహస్రశిరచ్ఛేద అపూర్వ చింతామణి చదివి తెలుసుకుందాం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good