ఎన్ని మార్పులు వచ్చినా, మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి.

రూపసుందరీ, గుణసుందరీ, చదువుల సరస్వతీ, సంస్కారవతీ

అయిన అమ్మాయికి కుడి ఎడమల అన్నీ సమస్యలే.

అన్నీ చికాకులే.

తాను యిష్టపడిన యువకుడ్ని పైకి తీసుకురావాలనే

తాపత్రయం.

చెల్లెలికి చదువు.

తనచుట్టూ వున్న చిన్న ప్రపంచంలో మళ్ళీ సంతోష తరంగాలు

పెల్లివిరియాలనీ.

నవ్వుల పువ్వులు పూయాలనీ.

తన కుటుంబాన్ని సర్వనాశనం చేసిన వంశంలోని

సర్వావలక్షణ సంపన్నుని వివాహమాడి

తనవారికి రక్షరేఖై,

తన సౌభాగ్యానికి తానే వెలియై.

అపురూపంగా జీవించి.

ఇంటికి దీపమై కంటికి వెలుగై విలసిల్లిన ఓ చక్కని చుక్క

జీవనరాగ విపంచి ఈ ''అపురూప'' నవల.

Pages : 244

Write a review

Note: HTML is not translated!
Bad           Good