'సాహిత్య వికాసానికి కృషి చేస్తూ, తోటివారి అభివృద్ధికి చేయూతనందించడం నా ఆశయం'' అంటూ గర్వంగా చెప్పుకునే కథకుడు డి.కె.చదువులబాబు. వీరి పేరు ఎంత వినూత్నంగా ఉందో, ఇతని కథలు కూడా అంత వినూత్నంగా ఉంటాయి. వివిధ వార, మాస పత్రికల్లో సుమారు 50 సాంఘీక కథలు, బాలసాహిత్య రచనలు సుమారు 250 కథలు వీరివి ప్రచురితమయ్యాయి. నిజానికి వీరు మొదట బాలసాహిత్యాన్ని అందుకుని ఒక యజ్ఞంలా కథలు రాసి, ఆ తరువాత సాంఘీక కథలవైపు, పెద్దల కథలవైపు దృష్టి సారించారు. వీరి కథలు ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, జ్యోతి, విశాలాంధ్ర, వార్త, జాగృతి, ప్రజాశక్తి మొదలగు ప్రముఖ పత్రికలలో రెగ్యులర్‌గా ప్రచురిస్తున్నాయి. 2003లో ''బాలల కథలు'' అనే సంపుటిని ప్రచురించారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good