అమ్మ ఈ రోజు చనిపోయింది. లేదా నిన్న అయినా అయుండొచ్చు. ఎందుకంటే వృద్ధాశ్రమం నుండి వచ్చిన టెలిగ్రామ్‌లో ''మీ అమ్మ చనిపోయింది. రేపు అంత్యక్రియలు. మీకు మా సానుభూతి'' అని మాత్రమే ఉంది. దానితో బహుశా ఆవిడ చనిపోయింది నిన్నయినా అయి ఉండొచ్చని నాకు సందేహం కలిగింది.

అమ్మ ఉండే వృద్ధాశ్రమం అల్జీర్స్‌కు యాభైమైళ్ళ దూరంలో మారెంగోలో ఉంది. రెండుగంటలకు బస్సెక్కితే నేను అక్కడికి రాత్రయ్యే లోపలే చేరుకోగలను. అక్కడ రాత్రంతా అమ్మ భౌతిక కాయం పక్కన గడపాల్సి ఉంటుంది. రేపు సాయంత్రానికల్లా నేను వెనక్కి తిరిగి వచ్చెయ్యవచ్చు. అందుకే మా యజమానిని రెండు రోజులు లీవ్‌ కావాలని అడిగాను. ఆయన ఇవ్వనని తిరస్కరించలేనటువంటి కారణం. అయితే ఆయన కోపంగా చూశాడని నాకెందుకో అనిపించింది. వెంటనే ఇంకో నిముషం కూడా ఆలోచించకుండా ''సారీసార్‌! కానీ అది నా తప్పు కాదు. మీకు తెలుసుకదా'' అన్నాను.

అయితే నాకు తర్వాత అనిపించింది - నేను అలా అని ఉండకూడదేమోనని. అట్లా అనవలసిన అవసరం కూడా లేదు. నేను సారీ చెప్పాల్సిన కారణం కూడా ఏమీలేదు. నిజానికి ఆయనే నాకు సానుభూతి తెలియ జేయాల్సి ఉంది. రేపు బహుశా నేను నల్లని సంతాప సూచక దుస్తుల్లో ఆఫీసులోకి అడుగుపెట్టినప్పుడు ఆయన ఆపని చేయొచ్చు. ప్రస్తుతానికి అమ్మ ఇంకా చనిపోనట్టే. అంత్యక్రియలు అయిన తర్వాత కానీ ఆ విషాదానికి అధికారికంగా ఆమోదముద్ర పడదు.

రెండుగంటల బస్సెక్కి ఆ ఊరు బయలుదేరాను. మధ్యాహ్నం ఎండ మండిపోతోంది - అంటూ ప్రారంభించిన నోబెల్‌ బహుమతి గ్రహీత ఆల్బర్ట్‌ కామూ రచించిన ుష్ట్రవ ూ్‌తీaఅస్త్రవతీ / ూబ్‌రఱసవతీ కి తెలుగున అనువదించారు జి. లక్ష్మిగారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good