రక్తం ఊటలా ఎగిసిపడ్తోంది. వెనుకనించి పోలీసులు ఉరకలు వేస్తూ వస్తున్నారు.
మరోపక్క బ్రహ్మపుత్ర నది వరద భీభత్సంతో పెద్ద శబ్దం చేస్తూ పరవళ్ళు తొక్కుతోంది.
"ఈ పోలీసులకు చిక్కితే ఎన్ కౌంటర్ చేసి మరీ ప్రాణం తీస్తారు. ఆ చచ్చేదేదో ఈ వరదనీటిలో పడి చస్తే మేలేమో!' అనుకుని ఎగిరి వరదనీటిలోకి గెంతాడు అతుల్ బోర. పోలీసులు చూస్తుండగానే అతుల్ సుడులు తిరుగుతూ నీళ్ళలో కలిసిపోయాడు.
"వాడింక బతకడు. కొద్దిదూరంలో ఈ వరదనీరు చాలా దిగువకు జారిపడుతుంది. అదొక భయంకర జలపాతం. వీడికి తెలియదు పాపం. ఏ బండకొ, కొండకో గుద్దుకుని మరీ చస్తాడు" ఆయాసపడుతూ తోటి పోలీసులకు వివరించాడు వారి అధికారి.
ఈ సస్పెన్స్ విడాలంటే అపరాధ పరిశోధన కధలు చదవండి.
- యర్నాగుల సుధాకరరావు